కర్నూలు జిల్లాలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. ఆదోని పట్టణంలోని అరుణ జ్యోతినగర్లో సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్సపొందుతూ రంగమ్మ అనే వృద్ధురాలు మరణించారు. బాధితులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కర్నూలులో ప్రబలిన అతిసారం.. నలుగురు మృతి.. 40మందికి అస్వస్థత
అతిసారం కర్నూలు జిల్లా గోరుకల్లు వాసులను ఇబ్బంది పెడుతోంది. గత రెండు రోజులుగా గ్రామంలో అతిసారంతో అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. 60 మందికిపైగా చికిత్స పొందుతున్నారు.
water problem
కలుషిత నీటివల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని.. బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో అతిసారంతో.. నలుగురు మరణించారు. 60 మందికిపైగా చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:గోరకల్లులో అతిసారంతో ఇద్దరు మృతి
Last Updated : Apr 7, 2021, 12:39 PM IST