ఆల్మట్టి..
ఆల్మట్టి జలాశయం పూర్తి నీటిమట్టం 1705 అడుగులు కాగా... ప్రస్తుత 1704.59 అడుగులకు మేర నీళ్లు ఉన్నాయి. రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 127.47 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,91,922 క్యూసెక్కులు నీరు జలాశయానికి వస్తోంది. ఔట్‌ఫ్లో 1,01,922 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్..
నారాయణపూర్ జలాశయం పూర్తి నీటి మట్టం 1615 అడుగులు ఉండగా... ప్రస్తుతం 1612.83 అడుగుల మేర చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 34.65 టీఎంసీలుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 1,11,870 క్సూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా.. ఔట్‌ఫ్లో 88,884 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది.
జూరాల..
జూరాల జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 1044.06 అడుగులకు చేరింది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.07 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,35,669 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుండగా.. ఔట్‌ఫ్లో 1,27,417 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
శ్రీశైలం..
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం సామర్థ్యం 210.994 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 30,986 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్‌కు 35వేల క్యూసెక్కులు... హంద్రీనీవాకు 202 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.