SRISAILAM: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 40,446.. సుంకేసుల నుంచి 71,172 క్యూసెక్కుల నీరు వస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరింటికి జలాశయం నీటిమట్టం 881.90 అడుగులు, నీటినిల్వ 198.3623 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తూ 62,893 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
SRISAILAM: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. నేడు గేట్లు ఎత్తివేత - latest news in ap
SRISAILAM: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. నీటిమట్టం 881.90 అడుగులు, నీటినిల్వ 198.3623 టీఎంసీలుగా నమోదైంది. ఈ ఉదయం 11 గంటలకు ఆనకట్ట గేట్లు పైకెత్తి.. దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
srisailam
జల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం
శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయి ప్రారంభించారు. దీని ద్వారా సుమారు 765 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. ఎగువ నుంచి నీరు వస్తోంది. సాధారణంగా ఆగస్టులో విద్యుత్తు ఉత్పత్తికి బోర్డు అనుమతించేది. ఈ ఏడాది జులైలోనే ఎగువ నుంచి వరద వస్తుండటంతో ముందస్తుగా ఉత్పత్తి ప్రారంభించారు.
ఇవీ చదవండి: