ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటి నిల్వలు

శ్రీశైలం జలాశయంలో రోజురోజుకు నీరు అడుగంటిపోతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 807.9 అడుగులకు చేరింది.

water level decreasing in Srisailam Reservoir
water level decreasing in Srisailam Reservoir

By

Published : Apr 17, 2021, 5:05 PM IST

శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ 790 అడుగులు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.10 టీఎంసీలకు తగ్గిపోయింది. ఏప్రిల్ నెలలోనే ఈ పరిస్థితి నెలకొనటంతో వచ్చే రెండు నెలల్లో నీటిమట్టం మరింతగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో కచ్చితంగా 30 టీఎంసీల నిల్వ ఉంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. 2015- 16, 2016-17 మే నెలలో 18 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. గతేడాది 20 టీఎంసీలకు తగ్గింది.

ABOUT THE AUTHOR

...view details