కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరకల్లు జలాశయం వద్ద బైపాస్ పైపు లైన్ నుంచి నీరు ఎగిసి పడుతోంది. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరకల్లు జలాశయం వద్ద బైపాస్ పైప్ లైన్ నుంచి నీరు ఎగిసిపడుతోంది. పైప్ లైన్ లో గతకొద్దికాలంగా నీటి ప్రవాహం నిలిచిపోయింది. అందులో ఉన్న నీటిలో చేపలు పట్టు కోవడానికి స్థానికులు కొందరు పైప్ లైన్ పైన ఉన్న వాలును తీసేశారు. దీంతో నీరు ఎగిసిపడుతోంది.
గోరకల్లు జలాశయం పైపులైన్ నుంచి ఎగిసిపడుతున్న నీరు - water leakage from gorakallu reservoir pipeline
కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరకల్లు జలాశయం వద్ద బైపాస్ పైపు లైన్ నుంచి నీరు ఎగిసి పడుతోంది.
![గోరకల్లు జలాశయం పైపులైన్ నుంచి ఎగిసిపడుతున్న నీరు water leakage from gorakallu reservoir pipeline](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7379602-857-7379602-1590662719701.jpg)
గోరకల్లు జలాశయం పైపులైన్ నుంచి ఎగిసిపడుతున్న నీరు
నీటి ప్రవాహం చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున వచ్చి తిలకిస్తున్నారు. నీటి నుంచి చేపలు కింద పడుతుండడంతో కొందరు యువకులు వాటిని పట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
ఇదీ చదవండి: కంటోన్మెంట్ జోన్లో ఎస్పీ పర్యటన