ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం... రేడియల్ క్రస్ట్ గేట్ల మూసివేత - శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలోని అన్ని రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు.

water flow has became less in srisailam reservoir
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

By

Published : Aug 25, 2020, 10:13 AM IST

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 73,583 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జలాశయంలోని అన్ని రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుత నీటిమట్టం 884.200 అడుగులు కాగా... నీటినిల్వ 210.994 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్​కు 30,986 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 15.226 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్​కు 35,000 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details