భారీ వర్షాలతో నీటమునిగిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో స్థానికులు ఇంకా భయం భయంతో జీవిస్తున్నారు. మంత్రాలయం గ్రామానికి ఆనుకొని ప్రవహించే నల్ల వాగు పొంగి ప్రవహించడం వల్ల.. రామచంద్రాపురం శివారు ఎంపీడీవో కాలనీ ప్రాంతాల్లో 250 ఇళ్లలోకి వరద నీరు చేరింది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు మేర ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
మంత్రాలయంలో పలు ప్రాంతాలు నీట మునక.. వాగు కబ్జానే కారణమంటున్న స్థానికులు - mantralayam rain news
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నల్లవాగు పొంగి ప్రవహించడం వల్ల ఎంపీడీవో కాలనీ ప్రాంతాల్లో 250 ఇళ్లలోకి నీరు చేరింది. వాగు కబ్జా కావడం వల్లే మంత్రాలయాన్ని వరద ముంచెత్తిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రాలయంలో పలు ప్రాంతాలు నీట మునక
ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాఘవేంద్ర కూడలి వరకు ఉన్న దుకాణాలు.. నీట మునగడం వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఆధార్ కేంద్రాల్లో నీరు చేరి.. ఎలక్ట్రానిక్ సామాగ్రి ఎందుకు పనికిరాకుండా పోయాయి. వాగు కబ్జా కావడం వల్లే మంత్రాలయాన్ని వరద ముంచెత్తిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:srisailam dam: శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ప్రవాహం