కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజలు రోడ్డెక్కారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 20 రోజులుగా నీళ్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు - బళ్లారి ప్రధాన రహదారిపై కోడుమూరు అభివృద్ధి కమిటీ, తాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నిరసన విరమించాలని కోరిన గాజులదిన్నె ప్రాజెక్ట్ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
నీటి కోసం రోడ్డెక్కిన కోడుమూరు ప్రజలు - water
కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజలు రోడ్డెక్కారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
నీటి కోసం రోడ్డెక్కిన కోడుమూరు ప్రజలు