ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో 7 గంటలకుపైగా క్రస్ట్‌ గేట్లపై నుంచి నీరు..! - శ్రీశైలం జలాశయం క్రస్ట్‌ గేట్లు

శ్రీశైలంలో జాగ్రత్తలు, అప్రమత్తలు కొరవడ్డాయి. ఎగువ ప్రాంతాలనుంచి వరద ప్రవాహం అధికం కావడంతో నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. అదే సమయంలో7 గంటలకుపైగా క్రస్ట్‌ గేట్లపై నుంచి నీరు ప్రవహించింది. దీనికి నిర్వహణ లోపమే అని పలువురు విమర్శిస్తున్నారు.

water coming From the crust gates in Srisailam for over 7 hours
శ్రీశైలం జలాశయం

By

Published : Sep 11, 2020, 7:22 AM IST

నీటి ప్రవాహాల అంచనా తప్పిందా?

శ్రీశైలం జలాశయంలో గురువారం 7 గంటలకు పైగా నీరు క్రస్ట్‌గేట్ల మీదుగా ప్రవహించింది. ఇన్ని గంటల పాటు నీరు గేట్ల పైనుంచి ప్రవహించడం విమర్శల పాలవుతోంది. దీనికి నిర్వహణ లోపమే కారణమని ఇంజినీరింగ్‌ నిపుణులు వివరిస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులను కొనసాగించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల అమల్లో భాగంగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. జలాశయం నిండా నీరున్నప్పుడు గాలి వీస్తే కొద్దిగా తొణికిసలాడుతుందని, ఆ నీరే క్రస్ట్‌గేట్ల పైనుంచి ప్రవహించిందని డ్యాం నిర్వహణ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ శ్రీనివాసరావు ‘చెప్పారు. ఇదే కారణమని అనుకుంటే.. జలాశయం గేట్లు తెరిచి దిగువకు 1.12 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని ఎలా విడుదల చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు.

ప్రవాహం అంచనా మాటేంటి?

శ్రీశైలం 215.8070 టీఎంసీల నిల్వతో నిండుగా ఉంది. నాగార్జునసాగర్‌లోనూ కేవలం 6.43 టీఎంసీలను అదనంగా నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ దిగువన పులిచింతల 0.56 టీఎంసీల మేర మాత్రమే ఖాళీగా ఉంది. జలాశయాలన్నీ నిండుగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు వాతావరణాన్ని, ఎగువ ప్రవాహాలను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యత డ్యాం నిర్వహణ ఇంజినీరింగు సిబ్బందిదే.

  • గురువారం ఉదయం ఆరింటికి 79,711 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తుందని సమాచారం ఉంది. అప్పుడు డ్యాం వద్దకు 62,587 క్యూసెక్కులు వస్తోంది. 40వేల క్యూసెక్కులకుపైగా నీటిని వివిధ మార్గాల్లో విడిచిపెట్టారు.
  • ఉదయం తొమ్మిదింటికి జలాశయానికి 1,07,193 క్యూసెక్కుల ప్రవాహం పెరిగింది. అప్పటికే క్రస్ట్‌గేట్ల మీదుగా ప్రవాహం ప్రారంభమైంది. స్పిల్‌వేలో ఒక గేటును పదడుగుల మేర ఎత్తి 28,075 క్యూసెక్కులను వదిలారు.
  • మధ్యాహ్నం రెండింటికి 1,30,000 క్యూసెక్కులు వస్తుండటంతో 3గేట్లు తెరిచి 84,225 క్యూసెక్కులను దిగువకు వదిలారు. అప్పటికి కూడా క్రస్ట్‌గేట్ల మీదుగా నీరు ప్రవహిస్తూనే ఉంది. రాత్రి 9 గంటలకు మరో గేటుతో సహా మొత్తం నాల్గింటిని తెరిచి 1.12 లక్షల క్యూసెక్కులవరకు వదులుతున్నారు.
  • గాలి అలల వల్లే క్రస్ట్‌గేట్ల నుంచి నీరు ప్రవహించిందని చెబుతున్న ఇంజినీర్లు.. గేట్లు తెరుస్తూ ప్రవాహాలను పెంచడంలోని ఔచిత్యమేమిటో తెలియడం లేదు. ఎగువ ప్రాంతం, ప్రాజెక్టుల నుంచి ప్రవాహాలపై ముందే లెక్కలొస్తాయి. కేంద్ర జలసంఘం సైతం అప్రమత్తం చేస్తుంది.
  • గతేడాది సెప్టెంబరులోనూ ఈ ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేక నీరు పొంగిపొర్లింది.

ఏ ప్రమాదమూ లేదు...!

శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టాన్ని నెల్లాళ్లుగా నిర్వహిస్తున్నాం. గురువారం గాలి అలలకు నీరు కొంత క్రస్ట్‌గేట్ల మీదుగా పొర్లింది. ఇది సహజం. దీనివల్ల డ్యాంకు ప్రమాదం లేదు. జలాశయం నిండినా గరిష్ఠ నీటిమట్టానికి ఇంకా కాస్త దిగువనే ఉంది. పైగా 13,70,000 క్యూసెక్కులను వదిలేందుకు అనువుగా జలాశయాన్ని నిర్మించారు. ఇదేదో ప్రమాదమని చిత్రీకరించడం తగదు. నీటిని జాగ్రత్తగా నిల్వ చేయాలని ప్రయత్నిస్తున్నందునే ఇలా జరిగింది.

- ఇన్‌ఛార్జి ఎస్‌ఈ శ్రీనివాస్‌

ఇదీ చూడండి.'ఈనాడు' తోడు... సాకారమైన గూడు

ABOUT THE AUTHOR

...view details