ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్‌లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిందని... అలాంటి హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు.
ఓటుహక్కు పై అవగాహన
By
Published : Mar 19, 2019, 10:56 PM IST
ఓటుహక్కు పై అవగాహన
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని సాయి శ్రీ డిగ్రీ కళాశాలలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ఓటుహక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు... ఓటు హక్కు అని కళాశాల అధ్యాపకుడు గంగాధర్ విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఉపయోగపడే నాయకుణ్ణి ఎన్నుకోవాలని అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.