ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వస్తే సరి.. లేకపోతే పథకాలు కట్​.. వాలంటీర్​ అరాచకం - కర్నులులో వాలంటీర్ అఘాయిత్యాలు

Volunteer Sexual Harassment: పలు ప్రాంతాల్లో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు. ప్రజల బాధలు, కష్టాలను ఆసరాగా చేసుకుని లోబర్చుకోవాలని చూస్తున్నారు. ఎదురు తిరిగితే పింఛన్​, పథకాలు రాకుండా చేస్తున్నామని బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 1, 2023, 10:15 AM IST

Volunteer Sexual Harassment: తన వద్దకు రాకపోతే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తానంటూ ఓ వితంతువును గ్రామ వాలంటీరు వేధింపులకు గురిచేస్తున్న విషయం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఆస్పరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాలంటీరు సుధాకర్‌ తనను వేధిస్తున్నాడని బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల నుంచి అర్ధరాత్రి ఫోన్‌ చేయడం, రాత్రిపూట తలుపు తట్టడం వంటివి చేస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దగ్గరికి వెళ్లకపోతే పింఛను, చేయూత వంటి పథకాల డబ్బులు రాకుండా చేస్తానన్నాడని, అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details