కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. అయినా అతను ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నాడని కాలనీవాసులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సచివాలయ సిబ్బంది, పోలీసులు.. వాలంటీర్ ఇంటికి వెళ్లారు. వారితో అతను వాగ్వాదానికి దిగాడు. ఎంతో సేపటికి అంబులెన్స్‌లో కాకుండా.. ద్విచక్రవాహనంలో క్వారంటైన్ సెంటర్‌కు వెళ్తానని అధికారులకు చెప్పాడు. అప్పుడు అతన్ని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
క్వారంటైన్‌కు వెళ్లని వాలంటీర్.. కాలనీవాసుల ఫిర్యాదు - adoni latest news
కరోనా సోకిందని భయంతో మరణించిన వారిని చూశాం. ముందే జాగ్రత్త పడి.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినవారూ ఉన్నారు. కానీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వాలంటీరే కొవిడ్ సోకినా.. క్వారంటైన్‌కు వెళ్లనని పట్టుబట్టాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.
Volunteer