ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్నానాలకు అమమతి లేకపోతే పుష్కరాలకు రూ.కోట్ల ఖర్చు ఎందుకు..?'

తుంగభద్ర పుష్కరాల కోసం రూ. కోట్లు ఖర్చు చేసి పుష్కర ఘాట్​లో స్నానాలకు ఎందుకు అనుమతివ్వరని విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు.

vhp meeting tungabhadra pushkaralu
స్నానాలకు అమమతి లేకపోతే పుష్కరాలకు రూ.కోట్ల ఖర్చు ఎందుకు..?

By

Published : Nov 15, 2020, 7:22 PM IST

తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్నా పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పుష్కరాలపై చర్చించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కోట్ల రుపాయలు ఖర్చు చేసి.. నదీలో స్నానం చేసేందుకు అనుమతి లేదనడం సరికాదన్నారు. పుష్కరాలు అంటేనే నదీలో స్నానం చేయడమని... స్నానాలకు అమమతి లేకపోతే పుష్కరాలకు డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని పరిషత్ నాయకులు అమరసింహారెడ్డి ప్రశ్నించారు. స్నానాలకు అనుమతి ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:
మెట్టినింటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య..!

ABOUT THE AUTHOR

...view details