కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని ప్రముఖులు సందర్శించారు. ఆదివారం ద్వాదశి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mantralayam : మంత్రాలయ రాఘవేంద్రుని సేవలో ప్రముఖులు - మంత్రాలయం రాఘవేంద్రుని ప్రత్యేక పూజలు
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని ప్రముఖులు సందర్శించారు. ఆదివారం ద్వాదశి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి దర్శించుకున్నారు. కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జిలు, తెలంగాణలోని ప్రముఖులు దర్శించుకున్నారు.
మంత్రాలయాల రాఘవేంద్రుని సేవలో ప్రముఖులు
కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ ఇందిరేష్, జస్టిస్ శివ శంకర్ గౌడ, కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి మఠాధిపతులు రాఘవేంద్రుని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు స్వామి వారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. వీరికి పీఠాధిపతి ఫలమంత్రాక్షితలు అందించి ఆశీర్వదించారు.
ఇదీ చదవండి : శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
Last Updated : Oct 3, 2021, 4:29 PM IST