ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొక్కజొన్న గణపయ్య.. - Nandyala Sri Bhagwat Seva Samaj Latest Information

కర్నూలు జిల్లాలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నంద్యాలకు చెందిన నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు అయిదు వేల మొక్కజొన్న కంకులతో రూపొందించిన గణనాథుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు.

vinayaka chavithi
వినాయకుని వేడుకలు

By

Published : Sep 10, 2021, 3:25 PM IST

వినాయకుని వేడుకలు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏటా విభిన్న రూపాల్లో గణపతిని రూపొందించే నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఈ సారి అయిదు వేల మొక్కజొన్న కంకులతో గణపతి ప్రతిమను తీర్చిదిద్దారు. స్థానిక సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శ్రీ అంకుర జూర్ణ మహా గణపతి విగ్రహాన్ని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.

వినాయక చవితి ఉత్సవాలు.. కర్నూల్​లో వేడుకగా జరుపుతున్నారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద నున్న విఘ్నేశ్వరుని దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్నారు.

ఇదీ చదవండీ..శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details