కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఈ పాస్ యంత్రాలు నిర్వహించలేమని గ్రామ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. తమకు ఇచ్చే 5 వేల జీతం.. ఏమాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు అన్ని శాఖలు తమపై పనిభారాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ రేషన్ ఇవ్వలేమని... అవసరమైతే ప్రజలను మినీ ట్రక్కుల వద్ద లైన్లలో నిలబెడతామన్నారు. అనంతరం పనిభారాన్ని తగ్గించాలని కోరుతూ.. ఆత్మకూరు తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.
'ఈపాస్ యంత్రాలు నిర్వహించలేము' - latest news in Atmakuru
ఈపాస్ యంత్రాలు నిర్వహించలేమని.. కర్నూలు జిల్లా ఆత్మకూరులో గ్రామ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. అన్ని శాఖలు తమపై పనిభారాన్ని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాస్ యంత్రాలు నిర్వహించలేము