ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు - ఆదోని

కర్నూలు జిల్లాలోని ఈఎస్​ఐ డిస్ఫెన్సరీలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 7ఈఎస్​ఐ డిస్ఫెన్సరీలకు సంబంధించి 2014-2019 వరకు ఉన్న రికార్డులను పరిశీలించారు.

ఈఎస్​ఐ ఆస్పత్రిలో.. తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు

By

Published : Oct 6, 2019, 11:50 PM IST

ఆదోనిలో ఈఎస్​ఐ ఆస్పత్రిలో.. తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు

కర్నూలు జిల్లాలోని ఈఎస్​ఐ ఆస్పత్రులు అవినీతికి నెలవుగా మారుతున్నాయి. వైద్య సేవలు సైతం తూతూమంత్రంగా అందుతున్నాయి. రోగుల సంఖ్య తగ్గిపోతున్నా...ఇష్టానుసారంగా మందులు సరఫరా, కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం ఈఎస్​ఐ డిస్ఫెన్సరీలు 7, ఈఎస్​ఐ ఆస్పత్రి ఒకటి ఉన్నాయి. ఆదోనిలో 2 డిస్ఫెన్సరీలు, ఈఎస్​ఐ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ శాఖ ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టింది. 2014- 2019 మధ్య కాలంలో మందుల కొనుగోళ్ల, సరఫరా వ్యవహారం సక్రమంగా జరిగిందా? లేదా? అన్న కోణంలో తనిఖీ జరిగాయి. కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈఎస్​ఐ ఆసుపత్రుల్లో ఎక్కడా ల్యాబ్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. తనిఖీల్లో డీఈఈ గుణాకర్​రెడ్డి, విజిలెన్స్​ అధికారి ఆర్ తిరుమలేశ్వర్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details