ఎమ్మిగనూరులో రూ.70 లక్షల పత్తి విత్తనాలు స్వాధీనం - ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల సోదాలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా సీడ్ పత్తి జిన్నింగ్ చేస్తున్న మంజునాథ జిన్నింగ్ మిల్లుపై దాడులు జరిపారు. 70 లక్షల రూపాయలు విలువైన 15వేల కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ ఏడీఏ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్లాంట్ నడపడానికి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి యాజమాన్యం అనుమతులు పొందలేదని తెలిపారు.
ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల సోదాలు