Victoria Reading Room: నంద్యాల నూతన జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కేటాయింపులు జరుగుతున్నాయి. పట్టణంలోని పురాతన భవనం విక్టోరియా రీడింగ్ రూమ్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ట్రస్ట్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నోటీసులు ఇచ్చి భవనాన్ని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం తగదని అన్నారు. యథాతథంగా ఉంచాలని నంద్యాలలోని విక్టోరియా రీడింగ్ రూం క్లబ్ సభ్యులు కోరారు. న్యాయపోరాటం చేసైనా ట్రస్ట్ భవనాన్ని కాపాడుకుంటామని తెలిపారు.
1901లో గ్రంథాలయ నిర్మాణం..