ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలి'

By

Published : Sep 1, 2019, 8:09 PM IST

విశ్వహిందూ పరిషత్​లో మరో 51 లక్షల మందిని సభ్యులుగా చేర్పించడం తమ లక్ష్యమని సంఘం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్​ పరాన్డే అన్నారు. కర్నూలులో పర్యటించిన ఆయన..హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్​ చేశారు.

'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రభుత్వం అరికట్టాలి'

మిళింద్​ పరాన్డే కర్నూలు పర్యటన.
విశ్వహిందూ పరిషత్​లో 51 లక్షల మందిని వచ్చే నవంబర్​ నాటికి చేర్పిస్తామని సంఘం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్​ పరాన్డే కర్నూలులో అన్నారు. దానికోసం నమోదు కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏపీలో క్రైస్తవ పాస్టర్లకు, ముస్లిం మత గురువులకు ప్రతినెల వేతనాలివ్వడం వ్యతిరేకిస్తున్నామన్నారు. హిందూ పూజారులకు దేవాదాయ శాఖ జీతాలిస్తుంది. అలాగే వక్ఫ్​ బోర్డుల నుంచి వారికివ్వాలని డిమాండ్​ చేశారు. తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల్లో అన్యమత ప్రచారాన్ని మిళింద్​ వ్యతిరేకించారు. ఆయా ఆలయాల్లో పనిచేసే ఇతర మత సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని...లేకుంటే ఆందోళనలు చేస్తామని పరాన్డే హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details