కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంకల్‌భాగ్ హరిహరక్షేత్రంలో వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జిల్లా తెదేపా ఇంచార్జి టీజీ భరత్‌లు సతీసమేతంగా పాల్గొన్నారు. ఆలయలంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, చక్రస్నానం చేయటం ఆనవాయితీగా వస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు.
వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ గరుడ పక్షి ప్రదక్షిణలు గరుడ పక్షి ప్రదక్షిణలు:
బ్రహ్మోత్సవంలో భాగంగా యాగం చేసే సమయంలో వెంకటేశ్వరస్వామి వాహనమైన గరుడపక్షి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని ఎంపీ తెలిపారు. స్వామి చక్రస్నానంలో కూడా గరుడపక్షి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుందన్నారు. కర్నూలు ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ ఈ శుభకార్యంలో పాల్గొనాలని కోరారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగదన్నారు.
ఇదీ చదవండి