బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా చేరడంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎట్టకేలకు నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా వెంకట కృష్ణుడు భాద్యతలు చేపట్టారు. అంతకుముందు కమిషనర్ గా ఉన్న భవాని ప్రసాద్ ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెంకత కృష్ణుడు తెలిపారు. ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
నంద్యాల పురపాలక సంఘ కమిషనర్ గా వెంకట కృష్ణుడు - Venkata Krishna appointed as new Commissioner of Nandalala Municipal Council.
కర్నూలు జిల్లాలోని నంద్యాల పురపాలక సంఘం కొత్త కమీషనర్ గా వెంకట రామకృష్ణుడు భాద్యతలు చేపట్టారు. నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

నంద్యాల పురపాలక సంఘ కమిషనర్ గా వెంకట కృష్ణుడు
TAGGED:
kurnool