కూరగాయలు పంచిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
కరోనా కష్ట కాలంలో కర్నూలుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి తనవంతు సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నాడు. శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే 125మంది పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంచిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
సాఫ్ట్ వేర్ ఉద్యోగి బి. శివ శంకర్ రెడ్డి... శ్రీశైలంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సహాయం చేశాడు. దేవస్థానం వసతి విభాగాల్లో పనిచేసే 125 మంది పారిశుద్ధ్య సిబ్బందికి రెండు వారాలకు సరిపడా 10 రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, సిఐ రవీంద్ర చేతుల మీదుగా భౌతిక దూరాన్ని పాటిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది సరకులను అందుకున్నారు.