కర్నూలులో ప్రశాంతంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. రైతు బజార్లను నగరానికి మూడు కిలోమీటర్ల దురంలో ఏర్పాటు చేయడం వలన నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపాడు, నంద్యాల చెక్ పోస్ట్, సిల్వర్ జూబ్లీ కళాశాల వద్ద అధికారులు మూడు రైతు బజార్లను ఏర్పాటు చేశారు. పరిమిత కాలం మాత్రమే రైతు బజార్లు తెరిచి ఉండటం కూరగాయలు కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. కిరాణ షాపుల వద్ద ప్రజలు సామాజిక దురం పాటించక పోవడం వల్ల పోలీసులు దగ్గరుండి ప్రజలు ఆ నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
సామాజిక దూరమే.. ప్రస్తుతానికి భద్రం - కర్నూలులో రైతు బజార్ల ఏర్పాటు తాజా వార్తలు
కర్నూలుకి మూడు కిలోమీటర్లు దూరంలో అధికారులు రైతు బజార్లు ఎర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. కిరణాషాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం పోలీసులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
కర్నూలులో రైతు బజార్ల దూరం పాటించని ప్రజలు