కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల ఉత్సవాలను కలెక్టర్ వీరపాండ్యన్, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పర్యటకులు హాజరయ్యారు. ఈ గుహలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జిల్లా పాలనాధికారి చెప్పారు. పర్యటకులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దశలవారీగా రిజర్వాయర్ను పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. ఈటీవీ జబర్దస్త్.. అదిరే అభి హాస్య కార్యక్రమాలు నిర్వహించారు.
సందడిగా బెలూం గుహల ఉత్సవాలు ప్రారంభం - బెలూం గుహల ఉత్సవాలు
కర్నూలు జిల్లాలో బెలూం గుహల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా పాలనాధికారి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు మొదలుపెట్టారు.
బెలూం ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్
ఇదీ చదవండి:
అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం