కర్నూలులో తుంగభద్ర నదికి విశేష పూజల అనంతరం... వేద పండితులు భక్తి ప్రవత్తులతో వేద మంత్రాల సహితంగా పంచహారతి ఇచ్చారు. ఐదోరోజు నిర్వహించిన హారతి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దిష్టి దోషాన్ని నివారించే కుంభహారతి, నందీశ్వర దర్శన సమానమైన నందిహారతి,ఈశ్వర ప్రీతి పాత్రమైన బిల్వ హారతి, సర్ప దోషం తొలగించే నాగ హారతి, నామ దోషాలను తొలగించే నక్షత్ర హారతులను వేదపండితులు నిర్వహించారు.
సంకల్ బాగ్ పుష్కర్ ఘాట్ వద్ద పంచహారతి - thungabadra pushkaralu latest news
కర్నూలులోని సంకల్ బాగ్ పుష్కరఘాట్ వద్ద వేద పండితులు పంచహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
సంకల్ బాగ్ పుష్కర్ ఘాట్ వద్ద పంచహారతి