Vedavati Project Works has Been Stalled for Four Years:రాష్ట్రంలో జలకళ తీసుకొస్తానంటూ ప్రగల్భాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను ఎక్కడికక్కడ గాలికొదిలేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు నీరందించేందుకు ఉద్దేశించిన వేదవతి పనులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి.సీమ ముద్దుబిడ్డగా ప్రచారం చేసుకునే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా కరవు సీమను ఆదుకునే ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిందీ లేదు. నిర్మాణం పూర్తి చేయించిందీ లేదు. 2019లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 19 వందల 24 కోట్ల 80 లక్షల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చారు. అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 253 గ్రామాలతో పాటు రెండు పట్టణాల్లోని మొత్తం 10 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ ఎత్తిపోతల జగన్ నిర్లక్ష్యంతో ఎత్తిపోయింది.
Project Construction for Drought Prevention in Kurnool District:కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, హాలహర్వి, హొలగుంద, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలాల్లో నీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం వద్ద వేదవతి నది నుంచి నీటిని ఎత్తిపోస్తే సమస్య పరిష్కారమవుతుందనేది ప్రణాళిక. వరద రోజుల్లో ఈ నది నుంచి 8.292 TMCల నీటిని తీసుకునేందుకు వీలుగా ఈ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 3పంపుహౌస్‌లు, 2జలాశయాలు నిర్మించాల్సి ఉంది. 2.029 టీఎంసీ(TMC)ల నిల్వ సామర్థ్యంతో హాలహర్వి వద్ద ఒక జలాశయం, 1.027 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మొలగవల్లి వద్ద మరొకటి నిర్మించాలి. రెండింటి మధ్య గ్రావిటీ కాలువ తవ్వాలి. కానీ అవన్నీ పక్కనపెట్టేశారు.