ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుణుడి రాకకోసం... శ్రీశైలంలో యాగం

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసి పాడి పంటలతో కళకళలాడాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో తెలిపారు.

srisailam temple

By

Published : Jul 2, 2019, 3:45 PM IST

శ్రీశ్రైలం దేవస్థానంలో వరుణ యాగం

సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ పద్మా, ఆర్జేడీ భ్రమరాంబ, శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి ఈ యాగంలో పాల్గొన్నారు. శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశం పాడిపంటలతో కళకళలాడాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. తితిదే వేద పండితులు, బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శర్మ వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details