ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కావాలసింది భిక్ష కాదు.. మా హక్కు మాకు కావాలి: లక్ష్మన్న - Valmiki JAC leaders

Valmiki's Wants To ST Reservation: వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్న అన్నారు. వాల్మీకులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినంత మాత్రనా ఎలాంటి న్యాయం జరగదని స్పష్టం చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 27, 2023, 3:30 PM IST

Valmiki's Wants To ST Reservation : వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించిన రాజకీయ పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని వాల్మీకి జేఏసీ నాయకులు కర్నూలు సమావేశంలో అన్నారు. వాల్మీకుల సమస్యల పరిష్కారం కోసం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాల నుంచి వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలనీ పోరాటం చేస్తున్నామని, వాల్మీకులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినంత మాత్రనా ఎలాంటి న్యాయం జరగదన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమను వాడుకొని ఎలక్షన్ల తర్వాత సమస్యలను పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.

మాకు కావాలసింది భిక్ష కాదు..మా హక్కు కావాలి: లక్ష్మన్న

"మేము గత 35 సంవత్సరాల నుంచి వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలనీ పోరాటం చేస్తున్నాము. ఒకే రాష్ట్రంలో వాల్మీకులు కొన్ని జిల్లాలో ఎస్సీలుగా , మరికొన్ని జిల్లాలో ఎస్టీలుగా ఉన్నారు. ఇది చాలా అన్యాయమని ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి ముఖ్యమంత్రిని కొట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాటం చేస్తున్నాము. ప్రతి ముఖ్యమంత్రిని ఒత్తిడి చేయడం జరిగింది. మా పోరాట ఫలితంగా గత ప్రభుత్వం వాల్మీకులను ఎస్సీలుగా గుర్తించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం బిల్ పాస్ చేస్తే మా వాల్మీకుల జీవితాలు బాగుపడతాయి. కానీ ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎమంటున్నారంటే ఎమ్ఎల్ఏ, ఎమ్ఎల్​సీ టికెట్టు ఇచ్చామంటున్నారు. మాకు కావాలసింది భిక్ష కాదు... మాకు కావాలసింది ఇది కాదు... మా ఏకైక హక్కు వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించడం మాత్రమే." - లక్ష్మన్న, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details