కర్నూలు జిల్లా కోడుమూరులో ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక వల్లెలాంభ దేవి జాతర నిర్వహిస్తున్నారు. ఆలయంలోని వల్లెలాంభ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భాగంగా కోడుమూరు వైకాపా నియోజకవర్గ బాధ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రారంభించారు.
కోడుమూరులో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు - Kurnool District Kodumuru News
ఉగాదిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కోడుమూరులో వల్లెలాంభ దేవి జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను వైకాపా నియోజకవర్గ బాధ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రారంభించారు.
కోడుమూరులో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వృషభాలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేల నగదు.. నాలుగు, ఐదో స్థానాల్లో గెలుపొందిన వారికి రూ.20వేలు, రూ 10 వేలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి