ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అహోబిలం స్వామివారి దర్శనం ఉచితంగా కల్పిస్తాం' - అహోబిలం దేవస్థానం వార్తలు

అహోబిల మఠం నూతన మేనేజర్​గా వైకుంఠం స్వామి బాధ్యతలు చేపట్టారు. అహోబిలంలో నరసింహ స్వామి దర్శనానికి టిక్కెట్లు వసూలు చేయకుండా భక్తులకు ఉచితంగా దర్శనం కల్పిస్తామని చెప్పారు.

ahobilam  temple
ahobilam temple

By

Published : Jun 10, 2020, 4:32 PM IST

కర్నూలు జిల్లాలోని అహోబిల మఠం నూతన మేనేజర్​గా వైకుంఠం స్వామి బాధ్యతలు స్వీకరించారు. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆదేశాలతో ఆయన బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. వైకుంఠస్వామి గతంలో దేవస్థానంలో ప్రధాన పూజారిగా, పూజా కైంకర్యం బాధ్యతలు పర్యవేక్షించే మణియార్​గా విధులు నిర్వర్తించారు.

నరసింహ స్వామి దర్శనానికి భక్తుల నుంచి ఇకపై టిక్కెట్లు వసూలు చేయబోమని... ఉచిత దర్శన సౌకర్యం కల్పిస్తామని బాధ్యతల స్వీకరణ అనంతరం వైకుంఠం స్వామి వెల్లడించారు. పీఠాధిపతుల సహకారంతో అహోబిల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details