కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు.
ఇటీవల లాక్ డౌన్ సడలింపుతో ఆలయాన్ని తెరిచారు. అనంతరం.. ఆలయంలో పలువురు సిబ్బందికి కరోనా సోకింగి. ఈ కారణంగానే.. ఉత్సవాలను రద్దు చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆర్, ఆలయ ఈవో వాణి ప్రకటించారు. ప్రస్తుతం ఆలయంలో ఆరు కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఈవో తెలిపారు.