ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహితపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - నంద్యాలలో స్కూటీపై వెళుతున్న మహిళను ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన దుండగులు

కర్నూలు జిల్లా నంద్యాలలో స్కూటీపై వెళుతున్న ఓ వివాహితపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగులు ద్విచక్రవాహనంతో వెనక నుంచి ఆమె స్కూటీని ఢీ కొట్టారు. మెడపై కాలితో తొక్కినట్లు ఆమె పేర్కొంది. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.

attack on rape victim at nandyala
నంద్యాలలో అత్యాచార బాధితురాలిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

By

Published : Mar 5, 2021, 8:48 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్కూటీపై వెళుతున్న మహిళను.. కొంతమంది ద్విచక్రవాహనంతో వెనక నుంచి ఢీ కొట్టారు. వారిలో ఒకరు తన మెడపై కాలితో తొక్కినట్లు బాధితురాలు తెలిపింది. గాయపడిన వివాహితను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడిలో గాయాలపాలైన మహిళ.. అత్యాచార బాధితురాలు కావడం గమనార్హం. ఆ కేసులో ఈ నెల 3న అదిల్ బాషా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెపై దాడి జరగడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details