కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బిల్డర్ సత్యనారాయణపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. తనకు చెందిన భవనంలోని ఓ హోటల్ యజమానికి.. దాడిలో ప్రమేయం ఉందని బాధితుడు ఆరోపించారు.
'విద్యుత్ బిల్లు చెల్లించకపోవడం వల్ల.. సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇది నేనే చేయించానని అనుమానంతో నాపై దాడి చేశారు' అని సత్యనారాయణ పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.