కర్నూలు జిల్లా నంద్యాల చిన్న చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వినాయక ఘాట్ సమీపంలో ఈ వ్యక్తి శవం నీటిలో తేలియాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సీఐ దివాకర్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
చిన్న చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - unknown person dead news in nandyal kurnool district
కర్నూలు జిల్లా నంద్యాల చిన్నచెరువులో తేలియాడుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సంఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఇవీ చదవండి
పిల్లలకు రక్షణ కవచాలుగా మారిన చీరలు...
Last Updated : Nov 5, 2020, 1:22 PM IST