కర్నూలు జిల్లా నంద్యాలలోని టీచర్స్ కాలనీ నివాసి అల్ల బకాష్ ఇంటిపైనున్న ప్లాస్టిక్ నీటి ట్యాంకులో.. మృత దేహం లభించింది. మూడు రోజులుగా నీరు రాకపోవడంతో.. మోకానిక్ ద్వారా ట్యాంకును పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంటిపై నీటి ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం - నంద్యాలలో ఇంటిపై నీటి ట్యాంకులో వ్యక్తి మృత దేహం
ఇంటిపైనున్న నీటిట్యాంకులో.. ఓ మృత దేహం కలకలం రేపింది. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిందీ ఘటన. ఇంట్లోకి నీరు రాకపోవడంతో.. అల్లబకాష్ అనే వ్యక్తి మెకానిక్ ద్వారా పరిశీలించడానికి ప్రయత్నించాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయి.. పోలీసులకు సమాచారమిచ్చాడు.
![ఇంటిపై నీటి ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం dead body in water tank](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9382268-863-9382268-1604150815743.jpg)
నీటి ట్యాంకులో మృత దేహం