ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో ఇద్దరు తెదేపా నాయకులపై దాడి - తెదేపా నాయకుడు నారాయణపై దాడి

కర్నూలు జిల్లా గుంతకల్లులో ఇద్దరు తెదేపా నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఘటనలో తెదేపా నాయకుడు నారాయణ, ఆయన సోదరుడు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

unknow persons attack on two tdp leaders
గుంతకల్లులో ఇద్దరు తెదేపా నాయకులపై దాడి

By

Published : Jan 5, 2021, 5:56 AM IST

కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఇద్దరు తెదేపా నాయకులపై సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తెదేపా నాయకుడు నారాయణ, ఆయన సోదరుడు విష్ణుమూర్తి, బంధువు విశాల్ గాయపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని బాట సుంకలమ్మ దర్శనానికి సోమవారం రాత్రి నారాయణ, ఆయన సోదరుడు విష్ణుమూర్తి, బంధువులు బయలుదేరారు. విష్ణుమూర్తి, విశాల్​లు ద్విచక్ర వాహనంపై, నారయణతో పాటు కుటుంబ సభ్యులు ఐషర్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ముందు వెళుతున్న ఇద్దరినీ గుంతకల్లు శివారులో రెండు బైకులపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తలు ఆపి.. దాడికి దిగారు. అంతలోనే నారయణ వాహనం చేరుకుంది. తన తమ్ముడు విష్ణుకుమార్​ను కొడుతున్న వారిని నారయణ అడ్డుకోవటంతో ఆయనపైనా విరుచుకుపడ్డారు. రాళ్ల దాడిలో నారయణ కుడికాలికి బలమైన గాయమైంది. వాహనంలో 50 మంది ఉండటంతో వారంతా ప్రతిఘటించగా ఆగంతకులు పారిపోయారు.గాయపడిన ముగ్గుర్నీ గుంతకుల్లు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.

గుంతకల్లు ఒకటో,రెండో పట్టణ సీఐలు నాగశేఖర్​, చిన్న గోవిందు ఆసుపత్రికి వెళ్లి బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. విషయం తెలియగానే డోన్​ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్,తెదేపా పట్టణ అధ్యక్షుడు ఆనంద్​ , మాజీ మండలాధ్యక్షుడు ప్రతాప్​ నాయుడు ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో తెదేపా వారిపై దాడులు జరుగుతున్నాయని,వీటిని తాము ఖండిస్తున్నామని సుజాతమ్మ అన్నారు. దాడికి పాల్పడిన వారి ద్విచక్ర వాహనానికి చెందిన నంబరు ప్లేటు లభించిందని, దీని ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details