కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పట్టణంలోని ఆకాశ వంతన కింద 30 ఏళ్ల క్రితం దేవాలయం నిర్మించారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహం ముఖం దగ్గర పగలగొట్టారు. ఈ రోజు ఉదయం పూజలు చేయడానికి వెళ్లిన పూజారి గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజేనేయ స్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహాం ధ్వంసం
ఇదీ చదవండి:కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి దొంగల హల్చల్