కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. వేదపండితుల మధ్య స్వామివారి విగ్రహాలకు సంప్రదాయబద్ధంగా కల్యాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
యాగంటిలో వైభవంగా ఉమామహేశ్వర స్వామి కల్యాణం - యాగంటిలో ఘనంగా జరిగిన ఉమామహేశ్వర స్వామి కల్యాణం
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉమామహేశ్వర స్వామి కల్యాణం ఘనంగా చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాగంటిలో వైభవోపేతంగా ఉమామహేశ్వర స్వామి కల్యాణం
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గర్భగుడిలో స్వయంభూగా వెలసిన ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రాత్రి జాగరణ కార్యక్రమంతో పాటు కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.