ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

Two women died: రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆనంద్ థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులలో ఒకరూ తెలంగాణకు చెందిన మహిళ కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

train accident
రైలు ప్రమాదం

By

Published : Jan 16, 2023, 4:05 PM IST

Two women died: కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆనంద్ థియేటర్ వద్ద గుర్తుతెలియని రైలు ఢీ కొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహలు ఉన్నట్లు రైల్వే ఎస్.ఐ. సురేష్ కి సమాచారం రావడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతుల వివరాలు సేకరించారు. మృతిచెందిన ఓ మహిళ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం పెద్ద పోతులపాడుకు చెందిన సుంకమ్మ (33) గా గుర్తించారు. మరో మృతురాలు (20) వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే ఎస్ఐ. తెలిపారు. ఈఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details