ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు - విజయవాడ నుంచి ధర్మవరం

కరోనా కారణంగా నిలిచిపోయిన రైళ్లను అధికారులు పునః ప్రారంభించారు. కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా ఈ రెండు ప్రత్యేక రైళ్లను అధికారులు నడపనున్నారు. గుంటూరు నుంచి కాచిగూడకు ఒక రైలును.. విజయవాడ నుంచి ధర్మవరానికి మరో రైలును నడపనున్నట్టు తెలిపారు.

నంద్యాల మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు
నంద్యాల మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

By

Published : Apr 1, 2021, 5:45 PM IST

నేటి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను అధికారులు నడపించనున్నారు. గుంటూరు నుంచి కాచిగూడ కు ఒక రైలును.. విజయవాడ నుంచి ధర్మవరానికి మరో రైలు రాకపోకలు చేయనుంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఏడాది క్రితం ఈ రైళ్లను నిలిపివేసిన అధికారులు పునః ప్రారంభించారు. ఈ రైళ్ల రాకపోకల వివరాలను నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ అబ్దుల్ వహబ్ తెలిపారు.

గుంటూరు నుంచి కాచిగూడ రైలు

ఇవాళ సాయంత్రం 7 గంటలకు గుంటూరులో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9:45 కు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు.. నంద్యాలలో రాత్రి 12:05 కు ఆగుతుంది.

మరుసటి రోజు మధ్యాహ్నం 3-10 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి ఆ తర్వాతి రోజు ఉదయం 6-45కు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు నంద్యాలలో రాత్రి 12.05 కు ఆగుతుంది.

విజయవాడ నుంచి ధర్మవరం

నేడు విజయవాడలో రాత్రి 9:45 కు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 10:55 కు ధర్మవరం చేరుకుంటుంది. ఈ రైలు నంద్యాలలో రాత్రి 2:45 కు ఆగుతుంది.

మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు ధర్వవరం నుంచి బయల్దేరి ఆ తెల్లారి ఉదయం 6:50కి విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు నంద్యాలలో రాత్రి 11:45 కు ఆగుతుంది.

ఇవీ చదవండి:

అనారోగ్యంతో జవాన్ మృతి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details