కర్నూలు జిల్లా పాణ్యం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొర్రెలు మేపుతూ పాణ్యం నుంచి నంద్యాల వైపుకు వెళ్తున్నారు. రహదారిపై నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బయ్య (40) కడప జిల్లా మైలవరం మండలం నార్జాన్ పల్లె గ్రామానికి చెందిన నారాయణ (67) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఢీకొట్టిన వాహనం వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీ.. ఇద్దరు గొర్రెల కాపరులు మృతి - road accident at kurnool district
గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టటంతో సంఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లా పాణ్యం జాతీయ రహదారిపై ఘటన చేసుకుంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు గొర్రెల కాపరులు మృతి