కర్నూలు జిల్లా జులేపల్లెలో స్థల వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలో 85 సెంట్ల స్థలంలో ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డును తొలగించారు. సమస్య కోర్టులో ఉన్నా.. ఎస్సై వచ్చి బెదిరించి రేకుల షెడ్డు తొలగించారని ప్రసాద్ ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రసాద్ తెలిపాడు. షెడ్డు తొలగించడం కారణంగా మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అదే స్థలాన్ని కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలిపాడు. తన స్థలాన్ని ప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమించే యత్నం చేసినట్లు వాపోయాడు. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగానని శ్రీనివాసరావు తెలిపాడు.
స్థల వివాదం.. ఇరువురు ఆత్మహత్యాయత్నం! - కర్నూలు క్రైమ్ న్యూస్
కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జులేపల్లె గ్రామంలో ఓ స్థల వివాదంలో ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్థల వివాదం.. ఇరువురు ఆత్మహత్యాయత్నం!