కర్నూలు జిల్లా శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలోని శిఖరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో రాజమహేంద్రవరం, ధర్మవరం బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ధర్మవరం బస్సులోని ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ధర్మవరం బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. ఓ మృతురాలు సున్నిపెంట వాసిగా గుర్తించారు.
శ్రీశైలం సమీపంలో రెండు బస్సులు ఢీ.. ఇద్దరు మృతి - శ్రీశైలం వద్ద రోడ్డు ప్రమాదం
శ్రీశైలానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు