అల్లుడిని కాపాడబోయి మామ కూడ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సుంకేసుల జలాశయం సందర్శనకు వెళ్లి ప్రమాదవశాత్తు అల్లుడు డ్యామ్‌లో పడిపోగా కాపాడటానికి ప్రయత్నించిన మామా కూడ నీళ్లలో గల్లంతయ్యాడు.
కర్నూలులోని పాతపట్టణానికి చెందిన సోహైల్ కుటుంబ సభ్యులు సుంకేసుల డ్యాం సందర్శన కోసం వెళ్లారు. ఈ క్రమంలో డ్యాం వద్దనున్న పుష్కర ఘాట్ వద్ద సోహైల్ మేనల్లుడు ముస్తాహీమ్(6) నదిలో పడిపోయాడు. అల్లుడిని కాపాడేందుకు నదిలోకి వెళ్లిన సోహైల్ (32) సైతం గల్లంతయ్యాడు.