ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండలో వీరు పట్టుపడ్డారు. వారి నుంచి పది వాహనాలను స్వాధీనపరచుకున్నట్లు సీఐ తెలిపారు. వాటి విలున నాలుగు లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్.. పది బైక్లు స్వాధీనం - two persons arrested whos theft bikes news
కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండలో ద్విచక్ర వాహనాలను దోపిడీ చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పది బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
![ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్.. పది బైక్లు స్వాధీనం accused under police custody](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9519390-102-9519390-1605161379221.jpg)
పోలీసుల అదుపులో నిందితులు
బనగానపల్లెకు చెందిన అమీన్ సాహెబ్, మౌలాలి కొంత కాలంగా పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దోపిడీ చేస్తున్నారని సీఐ చెప్పారు. చోరీ చేసిన బైక్లను రవ్వలకొండ సమీపంలో ఉంచేవారన్నారు. స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కర్నూలులో తగ్గుముఖం పడుతున్న కరోనా