రాళ్లదొడ్డి సమీపంలో బైక్-లారీ ఢీ.. ఇద్దరు మృతి - కర్నూలులో రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
రాళ్లదొడ్డి సమీపంలో బైక్ లారీ 'ఢీ' ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు రవితేజ, సోనిగా గుర్తించారు. మృతుల్లో రవితేజది దేవనకొండ, బాలికది ఎమ్మిగనూరుగా గుర్తించారు. ఎమ్మిగనూరు నుంచి గోనెగండ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రామీణ సీఐ మహేశ్వర రెడ్డి, ఎసై రామసుబ్బయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.