కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి క్రాస్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దకడబూరు మండలం చిన్న కడబూరుకు చెందిన యల్లయ్య, వీరాంజనేయులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో గాయపడ్డారు.
కారు డ్రైవరు సైతం గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిని ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. యల్లయ్య, వీరాంజనేయులను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.