కర్నూలు జిల్లా నంద్యాలలోని నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం.. వారి సమీప బంధువులు ఆర్థిక తగాదాల కారణంగా వాగ్వాదానికి దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్న అప్పును వెంటన్ చెల్లించాలని డిమాండ్ చేయటంతో.. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫ్యాక్టరీ వద్దకు పోలీసులు చేరుకోవటంతో.. ఇరువర్గాలు మూడో పట్టణ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఫ్యాక్టరీలోకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ ఎండీ శ్రీధర్‌రెడ్డి పోలీసులను కోరారు. తమను ధూషించిన శ్రీధర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ.. మరో వర్గం వారు పట్టుబట్టటంతో పోలీస్ స్టేషన్ ఎదుటే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరు వర్గాల వారినీ హెచ్చరించి.. వారిని అక్కడ నుంచి పంపించివేశారు.
ఇరువర్గాల ఘర్షణ... పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు - నంద్యాల ఇరువర్గాల ఘర్షణ న్యూస్
కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం, వారి సమీప బంధువుల మధ్య ఆర్థిక తగాదాల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు హెచ్చరించటంతో.. ఇరువర్గాల వారిని అక్కడ నుంచి పంపించివేయటంతో సమస్య సద్దుమణిగింది.

ఇరువర్గాల ఘర్షణ