కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని దిగువ చింతలకొండ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో గాయపడ్డ గ్రామ వాలంటీర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ నారాయణ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను పోలీసులు వైద్య సేవల కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ....వాలంటీర్కు తీవ్రగాయాలు - కర్నూలు జిల్లా తెదేపా వైకాపా నేతల మధ్య గొడవ
కర్నూలు జిల్లా దిగువ చింతలకొండ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో గ్రామ వాలంటీర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ....వాలంటీర్కు తీవ్రగాయాలు